23, ఆగస్టు 2013, శుక్రవారం

ఒకరి మీద ఎందుకింత ద్వేషం?

ద్వేషం, పగ, ప్రతీకారం .... ఎందుకివన్ని??

ఒకరి మీద లేక ఒక వర్గం మీద ఎందుకింత ద్వేషం కలుగుతుంది?
అమానవీయం గా ఎందుకు దాడి చెయ్యలనిపిస్తుంది?
ఇష్టం వచ్చినట్టు విమర్శలు ఎందుకు చెయ్యాలనిపిస్తుంది??

ఎవడిమీదన్నా ద్వేషం కలిగిందనుకోండి,వాడి టెంక పగలగొట్టేబదులు వాడ్నోసారి క్షమించి చూడండి... అని అంటాననుకున్నరా?
అస్సలంటే అస్సలు అనను!
వుండాలి!
ద్వేషం వుండాలి!!

నిన్నెవడన్నా ఎదన్నా అంటే వాడి పుచ్చె రేగ్గొట్టేంత ద్వేషం వుండాల్సిందే!!! తప్పేం లేదు.
కాకపోతే ఆ ద్వేషాన్ని కాస్త కన్స్ట్రక్టివ్ గా, ప్రొడక్టివ్ గా మార్చుకోండి.

అర్థం కాలేదా?

నువ్వొక రైల్లోనో బస్సులోనో పోతున్నావు. కండక్టర్ వచ్చి నిన్ను ఫలానా వర్గం వాడివి కాబట్టి ఇక్కడ కూచోనివ్వను అని, ఠాట్ కాదు కూడదు అన్నందుకు నిన్ను అందులోనుంచి గెంటివెసాడనుకో, వేంఠనే ఓ దుడ్డుకర్రుచ్చుకుని వాడి గుండు పగలగొట్టావనుకో.. ఏమవుతుంది??

నీ మీద కేసవుతుంది!!

నీ ద్వేషం చల్లరినా విషయం మటుకు చిరిగి చాటంతై చాపంతవుతుంది.
అదే నువ్వు ఆ ద్వేషాన్ని నీ ఆయుధం లాగా మార్చుకుని సహనం తో అహింసాయుతంగా పోరాటం సాగించావనుకో.. నీ సమస్యకొక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, నీ ద్వేషానికి ఒక అర్థం పరమార్థం వుంటుంది. నీ జన్మ చరితార్థం అవుతుంది.

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్నారొక పెద్దమనిషి. నిజమే!
కానీ ఆ పోరాటాన్ని నువ్వెలా కోనసాగిస్తావో, ఏ పంథాలో సాగుతావొ అన్నదాన్నిబట్టే నీ బానిస సంకెళ్ళు పోతాయో లేక ఇంకా జటిలమై వుక్కు సంకెళ్ళుగా మారుతాయో అన్నది ఆధారపడివుంటుంది.

కాబట్టి మై డియర్ ఫైటర్స్, గొడవపడేది చాక్లెట్టు కోసమైనా చట్టం కోసమైనా, కాస్త ఇంగిత జ్ఞ్యానం, విచక్షణతో ప్రవర్తిస్తే ఆ గొడవకొక సార్థకత లభిస్తుంది కదా.
ఏమంటారు?

నేనొచ్చేసా....

తెలంగాణా సంగతి తేలిపోయింది, సమైక్యాంధ్ర సమ సమ్మగా ఉంది!
బ్లాగుల్లో లాగులేసుకునే వయసులొ అప్పుడెప్పుడో వచ్చి కొన్ని డవుట్లు తీర్చుకున్నా!
ఇప్పుడు ఇంకొన్ని ప్రశ్నలు మిగిలున్నాయి, చాలా జవాబులు ఇవ్వాల్సి ఉన్నాయి.
అందుకే,
నేనొచ్చేసా....