9, డిసెంబర్ 2009, బుధవారం

తెలంగాణా ఉద్యమకారులకు, తెలంగాణా బ్లాగర్లకు ఒక మనవి

తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టినప్పటినుంచి మీరు ఆంధ్ర అనే పేరుమీద చేసిన యుధ్ధం వికటించి తెలుగుతల్లి విగ్రహాలు పగలగొట్టేదాక వచ్చింది. సంతోషం! ఇకపై మీరు తెలుగులో రాయలన్నా తెలుగు లో మాట్లాడాలన్నా తెలుగు తల్లికి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసి అప్పుడు మొదలెట్టండి. లేదా తెలంగాణా భాషకు కొత్త లిపి ని కనిపెట్టుకోండీ. ఇదెక్కడి పిడివాదం అంటారా మీరు నేర్పిన విద్యయే.. మరెందుకు తెలుగుతల్లి విగ్రహాలను నాశనం చేసారు ?? తెలుగును ఎందుకు కాలదన్నారు ?? చదువుకోడానికి రాసుకోడానికి మటుకు తెలుగు లిపి కావాలా?? కానీ తెలుగుతల్లి విగ్రహాలు పగలగొట్టాలా??? ఇదెక్కడి న్యాయం. అందుకే అందరు ముక్కులు నేలకు తాకించండి.
లేదంటే ఈ విషయం గా ఇంకొక ఉద్యమం మొదలుపెట్టడానికి తెలుగు భాషాభిమానులు సిధ్ధం గా ఉన్నారు

6, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణ ప్రజలంటే ఎవ్వరు?

వారం రోజులుగా తెలంగాణా టాపిక్ ఎక్కడ చూసినా రగులుతోంది. మన బ్లాగర్లలో కూడా కొంతమంది ఇతోధికంగా తెలంగాణా వాదులకు నైతిక మద్దతు ఇస్తూ వ్యాసాలు రాసారు. అసలు ప్రత్యేక తెలంగాణా ఎందుకు (అమ్మతోడు నిజ్జంగానే తెలియక అడుగుతున్నా వ్యంగ్యంగా కాదు బాంచన్) అని అడగాలనుకున్న నాలాంటి అల్పజీవులను చైతన్యం చేస్తూ(??)కొన్ని కొన్ని తెలంగాణ చరిత్ర తెలిపే లింక్స్ ఇచ్చారు. నాకైతే ఏం సమఝ్ కాలేదనుకో భాయ్, అది వేరే సంగతి. కానీ నాకొచ్చిన సందేహాలను మటుకు నా స్నేహబృందంలో ఎవరు తీర్చలేకపోయారు. అందుకే ఇక్కడే అడుగుతున్నా. 1960 కి ఇప్పటికి తెలంగాణ ప్రజల్లో చాలా మార్పులొచ్చాయి కదా. ఉదాహరణకు నాలాంటి వాళ్ళు, మా తాతనో మా నాన్ననో హైద్రాబాదుకు నేను పుట్టకముందే వచ్చుంటారు, నాకైతే అవన్ని తెల్వది. పరేషాన్ ఏందంటే నేను పుట్టింది పెరిగింది చదివింది తిన్నది తాగింది తిరిగింది అంతా హైద్రాబాదులోనే. నేనేమో తెలంగాణావోడ్ని కాదంటున్రు. నాకైతే గా మిగతా ఏరియాలు ఎర్కలేద్. నా అసుంటొళ్ళు బొచ్చెడు మందున్నరు. అందరిదీ ఇదే ప్రశ్న. అసలు తెలంగాణా ప్రజలంటే ఎవ్వరు? మీరుచెప్పబోయె సమాధానం చరిత్రల్లోనుంచైతే మళ్ళొక ప్రశ్న. మన సంస్కృతిలో భాగమై మనతో పాటి నలుగుతున్న స్నేహితుల్లా మెలుగుతున్న ముస్లిం సోదరులెవ్వరు? జరంత చెప్పుండ్రి ప్లీజ్. నిజ్జంగానే తెల్వక అడుగుతున్నా..