12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

బ్లాగ్లోకపు సమస్యల పరిష్కారం కోసం శ్రీ యక్ష కమిటీ

తెలంగాణా ఉద్యమాన్ని అధ్యయనం చెయ్యడానికి శ్రీ క్రిష్ణ కమిటీ లాగా ఏకలింగం గారి సూచనమేరకు నాకు నేనే ఒక కమిటీ వేసుకుని పరిశీలించి పరిశోధించి ఎవరు కాగడానో ఎవరు కాగడా మొగుడో కనిపెట్టి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తా అని హామీ ఇచ్చేస్తున్నా.

నేనే ఎందుకు అంటారా??

ఈ మధ్య నాక్కుడా కాస్త పాపులారిటీ పిచ్చ పట్టుకుంది. ఆల్రెడీ కెబ్లాసలో జనాలు ఓకెలికేసుకుంటున్నారు. సో అక్కడ వర్కవుట్ అవ్వదు, పోనీ స్త్రీ విమోచనం మీద కానీ రామయణమో భారతం మీదనో ఎదన్నా కథ కవిత రాద్దామనుకుంటే అందుకు అల్రెడీ వేరేవాళ్ళున్నారు, వాళ్ళెలాగూ పిచ్చ ఫేమస్. కాబట్టి మనకెందుకు ఆ దూల?

మనకా పాత పాటలు పద్యాలు తెలీదు, వంటలు అసలే రావు. పోని విప్లవాత్మక శృంగార భావాలున్నయ్యా అంటె అది కూడ కష్టమే. తెలంగాణా గురించి ఇప్పుడొక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది కాబట్టి (నా పాత పోస్టుల్లో ఒక మహానుభావుడెవరో "ఏం తెల్వకుండ నువ్వు మాట్లాడ్త లేవ్? గట్లనే వాడు గూడ! " అన్నప్పట్నుంచి తెగ రీసర్చ్ చేసి తెలుసుకున్నాక తెలంగాణ అడగడంలో తప్పేం లేదనిపించింది. కానీ నేనింకా సమైక్య వాదినే అలాగని తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిని కాదనుకో, ఐనా ఇది ఇప్పుడు అప్రస్తుతం)ఇలా ఏ రకంగా చూసినా నేను ఇప్పట్లో ఫేమస్ అయ్యే సూచనలు కనపడ్డం లేదు అనుకుంటుండగా ఎడారిలో ఎండమావి లాగ ఈ గొడవొకటి కనిపించింది,

కాబట్టీ ఎవరు పిలిచినా పిలవక పోయినా నా అంతట నేనే దూరిపోతున్నానహో ....

13, జనవరి 2010, బుధవారం

అదుర్స్ సినిమాని అడ్డుకుందాం రా..

ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక వర్గం వారిని అవహేళన చేస్తూ పంచకట్టు పిలక జుట్టు అంటూ కామెడి చేసారు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వ్యాపారాగ్ర వర్గాల అభిజాత్యాన్ని ఖండిస్తున్నా, ఇంకెంతకాలమీ చిన్నచూపు, ఇంకెన్నేళ్ళీ ఎగతాళి.

11, జనవరి 2010, సోమవారం

అవతార్ డౌన్ డౌన్, జేంస్ కామెరూన్ గోబ్యాక్

అన్నలారా అక్కలారా కేవలం అమెరికా మరియు ఇతర పెట్టుబడిదారి వ్యవస్థలైన అగ్రదేశాల ధనంతో నిర్మించి డబ్బులుదండుకోడానికి మాత్రమే మన తెలుగులో డబ్బింగ్ చేసి (పైగా ఒక్కటంటే ఒక్క తెలంగాణా పదం కూడా వాడకుండా) మన పర్సులను కొల్లగొడుతున్న చిత్రం అవతార్ ని నిషేదిద్దాం. రేపే అందరు అవతార్ ప్రదర్శిస్తున్న సినిమా హాళ్ళ దగ్గర ధర్నా మొదలుపెట్టడానికి హాజరవ్వండి.

PS : ఆ తర్వాత మెల్లిగా హింది మరియు ఇతర భాషా చిత్రాల పనిపడదాం