6, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణ ప్రజలంటే ఎవ్వరు?

వారం రోజులుగా తెలంగాణా టాపిక్ ఎక్కడ చూసినా రగులుతోంది. మన బ్లాగర్లలో కూడా కొంతమంది ఇతోధికంగా తెలంగాణా వాదులకు నైతిక మద్దతు ఇస్తూ వ్యాసాలు రాసారు. అసలు ప్రత్యేక తెలంగాణా ఎందుకు (అమ్మతోడు నిజ్జంగానే తెలియక అడుగుతున్నా వ్యంగ్యంగా కాదు బాంచన్) అని అడగాలనుకున్న నాలాంటి అల్పజీవులను చైతన్యం చేస్తూ(??)కొన్ని కొన్ని తెలంగాణ చరిత్ర తెలిపే లింక్స్ ఇచ్చారు. నాకైతే ఏం సమఝ్ కాలేదనుకో భాయ్, అది వేరే సంగతి. కానీ నాకొచ్చిన సందేహాలను మటుకు నా స్నేహబృందంలో ఎవరు తీర్చలేకపోయారు. అందుకే ఇక్కడే అడుగుతున్నా. 1960 కి ఇప్పటికి తెలంగాణ ప్రజల్లో చాలా మార్పులొచ్చాయి కదా. ఉదాహరణకు నాలాంటి వాళ్ళు, మా తాతనో మా నాన్ననో హైద్రాబాదుకు నేను పుట్టకముందే వచ్చుంటారు, నాకైతే అవన్ని తెల్వది. పరేషాన్ ఏందంటే నేను పుట్టింది పెరిగింది చదివింది తిన్నది తాగింది తిరిగింది అంతా హైద్రాబాదులోనే. నేనేమో తెలంగాణావోడ్ని కాదంటున్రు. నాకైతే గా మిగతా ఏరియాలు ఎర్కలేద్. నా అసుంటొళ్ళు బొచ్చెడు మందున్నరు. అందరిదీ ఇదే ప్రశ్న. అసలు తెలంగాణా ప్రజలంటే ఎవ్వరు? మీరుచెప్పబోయె సమాధానం చరిత్రల్లోనుంచైతే మళ్ళొక ప్రశ్న. మన సంస్కృతిలో భాగమై మనతో పాటి నలుగుతున్న స్నేహితుల్లా మెలుగుతున్న ముస్లిం సోదరులెవ్వరు? జరంత చెప్పుండ్రి ప్లీజ్. నిజ్జంగానే తెల్వక అడుగుతున్నా..

7 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణా ప్రజలంటే కేసీయార్ & పార్టీ - వాళ్ళు ఎవర్ని చూపించి తెలంగాణా వాళ్లంటే వాళ్ళే తెలంగాణా వాళ్ళు.

    రిప్లయితొలగించండి
  3. తెల్వక అడుగుతున్నవని నమ్మడం లేదు. అయిన చెప్తున్నా.

    ముందు తెలంగాణా అనేది " రాష్ట్ర పునరుద్ధరణ " సమస్య అని గ్రహిస్తే మిగత విషయాలు అవే అర్ధం అవుతాయి.

    ఆంద్ర రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం గా ఉనికిలో వుంది.
    తెలంగాణా రాష్ట్రం 1948 నుంచీ 1956 వరకూ స్వతంత్ర రాష్ట్రం గా వుంది. మిగులు బడ్జెట్ తో వుంది. తన కాళ్ళ మీద తను బతుకుతోంది.

    1956 లో ఆంధ్రా నేతలు మాయ మాటలు చెప్పి, దొంగ వాగ్దానాలు చేసి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణాను ఆంధ్రాలో విలీనం చేసుకున్నారు.
    ఆ తర్వాత ఇచ్చిన హామీలను, చేసుకున్న ఒప్పందాలను అన్నింటిని తుంగలో తొక్కి తెలంగాణాకు అడుగడుగునా అన్యాయం చేస్తూ వస్తున్నారు .

    దాంతో తెలంగాణా ప్రజల్లో " కలిసుంటే లేదు సుఖం - విడిపోతేనే బాగు పడతాం " అనే భావన ఏర్పడింది.

    దరిమిలా 1969 లో ప్రత్యేక తెలంగాణా కోసం ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని రక్తపు టేర్లలో ముంచి అణిచి వేసారు.
    ఇప్పుడు అదే ఉద్యమం మళ్ళీ గత పదేళ్లుగా సాగుతోంది.
    ఇది పరిపాలనా పరంగా " తెలంగాణా రాష్ట్రం " ఏర్పాటు కోసం సాగుతున్న ఉద్యమమే తప్ప మరొకటి కాదు.

    భావోద్వేగాలతో కొందరు కొన్ని మాటలు అన్నంత మాత్రాన వాటిని ఎవరూ పట్టించుకోనవసరం లేదు.
    రేపు ఏర్పడే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అతిక్రమించి మాకు ఏదో అన్యాయం చేస్తుందేమో, ఆంధ్రా వాళ్ళ నందరినీ వేల్లగోడుతుందేమో అనడం ఒక దుష్ప్రచారం మాత్రమె.

    తమిళనాడులో కర్ణాటకలో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఆంద్ర వాళ్ళు ఉన్నట్టే రేపు తెలంగాణా రాష్ట్రం లోనూ వుంటారు.
    తమిళనాడును ఏలిన ఏలుతున్న ఎం జి ఆర్ , జయలలిత, రజనీకాంత్ మొదలైన వాళ్ళు అసలు తమిళులే కాదు.
    అట్లాగే కర్ణాటకలో ఆంద్ర మంత్రులు సృష్టిస్తున్న కలకలం చూస్తూనే వున్నాం.
    అట్లాగే ఇక్కడా ఆంధ్రులకు రేపు ఏమీ కాదు.

    అసలు నేను ఆంధ్రా వాణ్ని అని ఊరికే అనుకుంటూ కూర్చోకుండా తెలంగాణా ప్రజల్లో అరమరికలు లేకుండా కలిసిపోయే ప్రయత్నం చేస్తే మంచిది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మీ వంతు సహకారం అందిస్తే మరీ మంచిది.
    అక్రమ ఆక్రమణలతో రియల్ ఎస్టేట్ దందా చేసే, అక్రమ వ్యాపారాలు చేసే, గూండాయిజం చేసే ఆంధ్రా వాళ్ళు భయదాలేమో గానీ బ్రతుకుదెరువు కోసం వచ్చిన సామాన్య ఆంధ్రా వాళ్ళు ఎందుకు భయపడాలి?
    1956 కు ముందునుంచీ ఇక్కడికి ఆంద్ర సామాన్య రైతులు, ప్రజలు వలస వస్తూనే వున్నారు కదా.
    భాషా సమస్యవల్ల ... ఆంధ్రులు కనబరిచే చులకన భావం వల్ల ... తెలంగాణా నుంచి ఆంధ్రాకు మాత్రం వలసలు అప్పుడూ లేవు ఇప్పుడూ లేవు.
    మీరే వివక్షను పాటిస్తూ మమ్మల్ని ఆడిపోసుకుంటే ఎట్లా.

    రిప్లయితొలగించండి
  4. ప్రభాకర్ మందార గారి "పునరుద్ధరణ" వాదం భలే గమ్మత్తుగా ఉంది. యక్ష గారి ప్రశ్నలకు సమాధానాలివ్వకపోగా కొత్త సందేహాలను లేవదీసింది. అవేంటంటే..

    ఇది రాష్ట్ర ఏర్పాటు కాదు, రాష్ట్ర పునరుద్ధరణ అనే కొత్త సంగతి చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందే హైదరాబాదు రాష్ట్రం ఉందంట. అంచేత ప్రస్తుత తమ కోరిక దాన్ని పునరుద్ధరించడమేనంట. నా ప్రశ్నలు రెండు:

    1. ఆ హైదరాబాదు రాష్ట్రాన్ని అప్పుడున్నట్టుగా ఏర్పాటు చేస్తే అది "పునరుద్ధరణ" అవుతుంది, నిజమే! ఇప్పుడు అలాగే చెయ్యబోతున్నారా? కర్ణాటక, మహారాష్ట్రలకు మీ కోరిక తెలుసా?

    2. సంయుక్త రాష్ట్రంగా ఉండాలనేది ఏదో కొత్త కోరిక కాదు అని నేనంటున్నాను. ఎందుకంటే సర్కారులను, దత్తమండలాన్నీ తెల్లోడికి ధారాదత్తం చెయ్యకముందు మనమంతా ఒకే రాష్ట్రం (పోనీ.. దేశం). ఈ కారణం చేత రాష్ట్రం విడిపోకూడదు, ఒకే రాష్ట్రంగా ఉండాలి. ఇంకా ముందుకుపోతే 13 వ శతిలో మనమంతా కాకతి గణపతిదేవ చక్రవర్తి పాలనలో ఉన్న ఒకే దేశస్తులం - అంచేత కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలి. తమిళనాడులో కొంత, కర్ణాటకలో కొంతనూ కూడా కలిపేసుకోవాలి. మరి "పునరుద్ధరణ" వాదం ప్రకారం అలా చెయ్యడం - దీన్ని "యథాతథ వాదం" అనొచ్చేమో - సమంజసమే కదా?

    రిప్లయితొలగించండి
  5. ప్రభాకర్ గారు,
    నేను తెలియకనే అడిగా.
    ఏ ఉద్యమానికైనా సైధ్ధాంతిక స్పస్టత వుంటుందిగా, అదేదో తెలుసుకుందాం అని.

    నాలాగా అడిగేవాళ్ళందరూ తెలంగాణా వ్యతిరేకులు కారు. ఆంధ్ర ప్రదేశ్ అభిమానులు. తెలుగన్నది ఒకభాష తెలంగాణ అందులో ఒక యాసగా మాత్రమే తెలిసిన నాలాంటి అగ్ఞ్యానులకు, ప్రాంతీయవాదాన్ని భాషతో ముడివేసి తెలుగుతల్లి విగ్రహాలు పగలగొట్టి అంధ్రా మీల్స్ అన్న బోర్డులని తిరగరాయించి, ఆంధ్ర అన్న పదమే ఒక బూతులా ఫీలయ్యి చేస్తున్న వుద్యమాన్ని చూసి సానుభూతి కలగకపోగా హాస్యాస్పదంగా తయారయ్యే సమయంలో ఇప్పుడుకదా ఉద్యమం తీవ్రరూపం దాల్చి పరిస్థితి వేడెక్కింది.

    మరి ఇన్నాళ్ళు చేసిన చేష్టల వల్లనే మీరంటున్న వాదాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు.
    దానికి తోడు మీరన్న పునరుధ్ధరణ వాదం తిరకాసుగా వుంది. నేతలు తొక్కేసారు అన్నారు మరి ఆ నేతల్లో తెలంగాణా నేతలు లేరా? జరగాల్సింది రాజకీయ పునరుధ్ధరణ! రాస్ట్ర విభజన కాదు. ఐనా ముప్పాతికవంతు ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే ఐనా సీమ బావుకున్నదేముంది?? తెలంగాణలో వున్న ఇతరప్రాంతాల వాళ్ళకు ఇన్నాళ్ళు లేనటువంటి అనవసరపు అలోచనలు మీరే కల్పిస్తున్నారేమో ఒక సారి సరిచూసుకోండి. ఇక్కడ వున్నవాళ్ళు అమరికలులేకుండా కలిసిపోయి చానాళ్ళయ్యింది. అందుకేగా నేను తెలంగాణా నుంచి తెలంగాణా ప్రజలు వేరు చెయ్యబడుతున్నారేమో అని సందేహపడింది.

    ఏదెమైనా మీ సమాధానం హుందాగా వుంది. మీరిలాగే విషయాన్ని చర్చిస్తే సమస్యకున్న వివిధ కోణాలను చూడగలుగుతాము.

    రిప్లయితొలగించండి
  6. సందీప్, ఆ ముక్క గట్టిగా అనకు ఇప్పుడసలే టైం బాలేదు.

    చదువరి గారు, మీ పాయింట్ లాజికల్ గా వుంది. నాకసలే ఒకటి చెప్తే పది డవుట్లు వస్తాయి అలాంటిది మీరిలా హింటిస్తే నేను అంటుకుపోతాగా. చుద్దాం ఏ చర్చ ఎటుపోతుందో ఎన్నింటికి సమాధానాలు దొరుకుతాయో..

    అసలు నాకు బుర్ర దొబ్బింది ఎక్కడంటే మొన్న టీవీ లో ఒక బుడ్డోడు జై తెలంగాణా అంటు పోతున్నాడు, వాడ్ని పక్కకు లాగి ఏంటిబాబు అనడిగితే జై తెలంగాణా అని తప్ప వేరే ప్రశ్నలకు సమాధానం లేదు. వాడికొక పద్నాలుగేళ్ళు కూడా వుండవేమో.

    రిప్లయితొలగించండి
  7. "ఒక బుడ్డోడు జై తెలంగాణా అంటు పోతున్నాడు..."

    ఏం తెల్వకుండ నువ్వు మాట్లాడ్త లేవ్? గట్లనే వాడు గూడ!

    రిప్లయితొలగించండి